బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం 

  • ఎవరి బెదిరింపులకు బయపడదు

విశ్వంభర , శంషాబాద్: బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని ఎవరి బెదిరింపులకు భయపడదని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో మంగళవారం  బిఅర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 118 నియోజకవర్గ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. రాళ్లగూడ రోడ్డు నిర్మాణ పనుల జాప్యంపై  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అధికారులను వెంటనే స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బిఅర్ ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కొలను ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అధికారులను ప్రశ్నిస్తే అధికార పక్ష నాయకులకు ఎందుకు మింగుడు పడడం లేదు? ప్రజల కోసం మాట్లాడే నాయకులను టార్గెట్ చేయడం సరికాదు అని అన్నారు. అలాగే అధికారులపై అధికార పార్టీ ఒత్తిళ్లు తేవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.119 నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చిన్నగండు రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీలకు అతీతంగా పని చేయాలి కానీ ప్రజల ఇబ్బందులను రాజకీయ లాభనష్టాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలి అని హితవు పలికారు.118, 119 డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచమల్ల జయసింహ మాట్లాడుతూ.. బిఅర్ ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు . ఎవరి బెదిరింపులకు భయపడదని అధికార పక్షం చేసే ప్రతి తప్పిదాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అన్నారు . వచ్చే ఎన్నికల్లో బిఅరెస్ అభ్యర్థి కార్తిక్ రెడ్డి విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఅరెస్ శంషాబాద్ సీనియర్ నాయకులు చిలకమర్రి పరందాములు, రాచమల్ల రమేష్, గుంటి చరణ్, హనుమంతు ముదిరాజ్, పరమేష్ తదితరులతో పాటు యువ నాయకులు రాచమల్ల కార్తిక్, బక్క శ్రీకాంత్, వేణు గౌడ్ , ఇతరులు పాల్గొన్నారు.

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-party-is-a-continuous-struggle-on-public-issues/article-15452

Tags: