డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ

  • నేడు ఉండవల్లి వచ్చిన టీటీడీ ఈవో శ్యామలరావు
  • బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
  • అనంతరం పవన్ కల్యాణ్ ను కలిసిన ఈవో
  • తిరుమల లడ్డూ కల్తీపై ఆరా తీసిన పవన్
  • గత పాలకమండలి తప్పిదం అని వివరించిన శ్యామలరావు

విశ్వంభర, విజయవాడ : టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించడం కోసం నేడు ఉండవల్లి వచ్చారు. చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రిక అందించిన అనంతరం, శ్యామలరావు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. గత పాలకమండలి హయాంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్టు ఈవో శ్యామలరావు వివరించారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలియజేశారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల వివరాలను ఆయన పవన్ కు తెలియజేశారు. 

Read More అలిపిరి నడకమార్గంలో.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ - తితిదే ఈవో శ్యామలరావు

కల్తీ నెయ్యి వినియోగానికి అనుమతించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించే విషయంలోనూ, ధార్మిక అంశాల అమలులోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. 

Tags: