పాము చర్మాన్ని వలిచి వండుకుని తిన్న యువకుడు.. చివరకు..!
ఈ మధ్య మనుషులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మన సంప్రదాయాలు, పద్ధతులను పక్కన పెట్టేసి విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. తిండి విషయంలో కూడా ఇలాంటి దారుణాలను చూడొచ్చు. ఇప్పటి వరకు పాములు, కప్పలను తినే వారు అంటే మనకు చైనా దేశానికి చెందిన వారే ఎక్కువగా గుర్తుకు వచ్చేవారు.
కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాంటి వారు ఎక్కువ అవుతున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాజేశ్ కుమార్ ఇలాంటి పనే చేశాడు. మనోడు ఒక పామును పట్టుకుని దాన్ని చంపేశాడు. ఆ తర్వాత దాని చర్మాన్ని ఒలుస్తున్నప్పుడు వీడియో తీశాడు.
ఈ వీడియోలో అతను చర్మాన్ని ఒలుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు అతన్ని పట్టుకోమమని ఆదేశించారు. దాంతో స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను పాము చర్మాన్ని ఒలుచుకుని తిన్నట్టు తేలింది. దాంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.