ప్రారంభమైన ఐదో దశ పోలింగ్.. రాహుల్ భవితవ్యం తేలేది నేడే!

ప్రారంభమైన ఐదో దశ పోలింగ్.. రాహుల్ భవితవ్యం తేలేది నేడే!


దేశంలో ఐదో విడత పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పోటీ పడుతున్నారు. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, ముంబయి నార్త్ నుంచి పీయూష్ గోయల్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలపైనే ప్రధానంగా అందరి దృష్టి. 


Read More వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి

ఈ దశలో మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లోని జరుగుతున్న స్థానాలు కీలకంగా మారాయి. మహరాష్ట్రాలో 13 స్థానాలకు పోటీ జరుగుతోంది. ఈ 13 స్థానాల్లోనూ శివసేన రెండు వర్గాల మధ్య పోరు ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లో ఈ దశలో 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 13 స్థానాలకు తన ఖాతాలో వేసుకుంది. ఒక్క రాయబరేలిలో మాత్రం సోనియా గెలిచారు. అయితే, ఈ సారి ఆ పరిస్థితి ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. 


ఈ దశలో జరుగుతున్న 49 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ.. ఈసారి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐదోదశలోనే ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశా అసెంబ్లీకి నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మే 13న పోలింగ్ మొదటి దశ పూర్తి అయింది. ఇవాళ రెండో దశలో భాగంగా 35 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేడీ, బీజేపీ నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచింది.

Related Posts