రాష్ట్ర అవతరణ దినోత్సవాలు.. సర్వాంగ సుందరంగా ట్యాంక్ బండ్

రాష్ట్ర అవతరణ దినోత్సవాలు.. సర్వాంగ సుందరంగా ట్యాంక్ బండ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి వేడుకలు కావడంతో ఈ ఈవెంట్స్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. వేడుకలను వాడుకొని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత కోల్పోయిందో.. ఉద్యమకారులను కాంగ్రెస్ ఎంత గౌవరించిందో.. తెలంగాణపై కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయనుంది. అందుకే చీఫ్ గెస్ట్‌గా ప్రభుత్వం సోనియాగాంధీని ఆహ్వానించింది. అయితే.. సోనియా రాకపై ఇక సస్పెన్స్ కొనసాగుతోంది.

 

Read More అపదలో అండగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు

ఇక.. ఈ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి వేడుకల్లో ట్యాంక్ బండ్ సరికొత్త అందాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్ సెక్రటరి శాంతికుమారి తెలిపారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే ఫుడ్ కోర్టులు ఉంటాయని తెలిపారు.   

 

Read More అపదలో అండగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు

రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణపై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నట్లు, బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.