బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్
On
- పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి..
- రేవంత్ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
- స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చిస్తారా? అనే సందేహం వ్యక్తమౌతోంది.



