"ప్రజా పాలన" లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు
విశ్వంభర, అంబర్ పేట్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రెండవ రోజు సందర్భంగా జిహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో బాగ్ అంబర్‌పేట్ డివిజన్ పరిధిలోని ఎస్‌బిహెచ్ కాలనీ పార్క్ వద్ద ప్రత్యేక ఈ వేస్ట్ సేకరణ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎస్‌బిహెచ్ కాలనీ పార్క్‌ను సందర్శించి కాలనీ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్థానిక నివాసితులతో మాట్లాడి కాలనీ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. కాలనీ పరిసరాలను ప్రతిరోజూ ఉదయం శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ–వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని ఆయన అభినందిస్తూ, ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, డీఎంసీ మారుతి దివాకర్ . డీఈఈ (శానిటేషన్) రఘు , జీహెచ్ఎంసీ డీఈఈ ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఏ తిరుపతి , యూబీడీ సంతోష్ , శ్రీధర్ , డివిజన్ అధ్యక్షుడు చంద్ర మోహన్ , బీఆర్ఎస్ నాయకులు మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.



