పాలనలో వార్డు సభ్యుల పాత్ర కీలకం
On
విశ్వంభర, పెద్ద శంకరంపేట: గ్రామస్థాయి పాలనలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని పెద్ద శంకరంపేట ఎంపీడీవో క్రాంతి కుమార్ పేర్కొన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట లోని రైతు వేదికలో నిర్వహించిన నూతన వాడు సభ్యుల శిక్షణ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. వార్డు సభ్యులందరూ ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను గ్రామాల అభివృద్ధిలో పాటుపడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షాకిర్ అలీ. సూపర్ ట్రైనర్లు లింగప్ప ప్రవీణ్ భాష ఆయా గ్రామాల నుండి వచ్చిన వాడు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



