వినాయక మండపం కూల్చివేత పై ఆగ్రహం
- యధావిధిగా నిర్మించాలి: ప్రభాకర్ గుప్తా
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ 13వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో గల వినాయక మండపమును మున్సిపల్ సిబ్బంది మూడు రోజుల క్రితం కూల్చివేసారు. దానికి నిరసిస్తూ ఆదివారం కరాటే కళ్యాణి అన్నపూర్ణ కాలనీలోని వినాయక మండపాన్ని సందర్శించారు. వినాయక మండపాన్ని కూల్చివేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ఎవరూ రాకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జెసిబి తో మండపాన్ని కూల్చివేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మండపాన్ని కూల్చొద్దు అంటూ ఎంత మొరపెట్టుకున్నా వినకుండా జెసిబి తో మండపాన్నికూల్చేశారన్నారు. కాలనీ వాసులంతా ఏకమై మా మండపం మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ దేవి, దేవతల గుల్ల పై ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్నీ ఖండిస్తూ తక్షణమే యధావిధిగా వినాయక మండపాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోడ్డు చివరలో లో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్న మండపాన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చింది అన్నారు. 2012 సంవత్సరంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నేడు ఆటంకంగా మారిందా అంటూ ప్రశ్నించారు.ఎవరో ఒకరు ఇద్దరు ఇచ్చిన కంప్లైంట్ లకి వినాయక మండపం ఏ విధంగా కూలుస్తారని మండిపడ్డారు. అన్నపూర్ణ కాలనీలోని కుటుంబాలు చందాలు వేసుకొని మండపాన్ని నిర్మించారని, అలాంటి మండపాన్ని నేడు కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. చాలాచోట్ల అనేక మండపాలు నిర్మించి ఉన్నాయని కానీ ఈ మండపం ఏ విధంగా అడ్డుగా ఉందని అన్నారు. గణేష్ మండపాలపై ఎటువంటి దాడి జరిగిన ఊరుకునే ప్రసక్తే లేదని సీతారాముల కళ్యాణం లోపల మండపాన్ని పున:నిర్మాణం జరిపించాలని లేనియెడల ఆందోళనలు చేపడతామని, ప్రతి ఒక్క హిందువు, భాగ్యనగర గణేష్ సమితి వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా, కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



