పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు
On
- ఇఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్
విశ్వంభర, మహబూబ్ నగర్: నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనీ ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ అన్నారు.సర్వేలు గ్రామానికి చెందిన కట్టెల మల్లేష్ కుమార్తె కట్టెల నాగలక్ష్మి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలోని ఎస్.వి.ఎస్ మెడికల్ కళాశాలలో డెంటల్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఇ ఎల్ వి భాస్కర్ తక్షణమే స్పందించారు. విద్యార్థిని నాగలక్ష్మి చదువుకు ఆటంకం కలగకూడదనే లక్ష్యంతో రూ. 20,000 నగదును ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో నిరుపేద ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.



