అతిథి గృహాల కు శంకుస్థాపన చేసిన మంత్రి
On
విశ్వంభర, సూర్యాపేట: సోమవారం సూర్యాపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, భవనముల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా 10 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, భవనముల అతిథి గృహంను రాష్ట్ర ఆహార పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత, సూర్యాపేట ఆర్డిఓ వేణు మాధవరావు, తహసిల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



