మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

విశ్వాంభర, పెద్ద శంకరంపేట:  మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐకెపి సిఆర్పిలు సుజాత రాధిక పేర్కొన్నారు. సోమవారం పెద్ద శంకర్పేటలోని శ్రీ శక్తి భవనంలో నిర్వహించిన మహిళా సమైక్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వయం సహాయ సంఘాల ద్వారా వదిన రుణాలు సద్వినియోగం  చేసుకోవాలని.  అనంతరం బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించాలని వారు పేర్కొన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఈపీఎం శకుంతల సీసీలు వీరాచారి స్వరూప అనసూయ మహిళా సంఘాల బాధ్యులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: