భారత్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తాం

భారత్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తాం

భారత్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామని ఉగ్రవాదులను  భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  భారత్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామని ఉగ్రవాదులను  భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. 'ఆపరేషన్ సిందూర్' అనేది మూడు సాయుధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మధ్య ఉన్న సమన్వయానికి, పూర్తి స్వేచ్ఛతో పనిచేయడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉగ్రవాదానికి గట్టిగా సమాధానం ఇచ్చామని చెప్పారు. శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని, వారి అణు బెదిరింపులను అణిచివేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా నిర్ణయించిన 9 లక్ష్యాలలో 7 లక్ష్యాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చర్యలకు దీటైన జవాబు ఇవ్వడంలో ఈ ఆపరేషన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతేడాది 31 మంది ఉగ్రవాదులను హతమార్చగా, అందులో 65 శాతం మంది పాకిస్థానీయులేనని వివరించారు.

Read More Sabarimala Gold Theft Case: శబరిమల ప్రధాన పూజారి అరెస్టు..!!

'ఆపరేషన్ సింధూర్' అనుభవాల ద్వారా సమాచార నిర్వహణలో తాము అనేక కీలక పాఠాలు నేర్చుకున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీర్ఘకాలంలో విజయం సాధించాలంటే ఇచ్చే సమాచారంలో విశ్వసనీయత, స్థిరత్వం ఉండటం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. సమాచార వ్యాప్తిలో ఎక్కడ శూన్యత ఏర్పడకూడదని, ఒకవేళ అలా జరిగితే ఆ ఖాళీని ప్రతికూల వార్తలు వేగంగా ఆక్రమిస్తాయని అభిప్రాయపడ్డారు.

మే 10 నుండి జమ్మూ కాశ్మీర్, పశ్చిమ సరిహద్దుల్లో పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ, నియంత్రణలో ఉందని ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఉత్తర సరిహద్దుల్లో (చైనాతో) పరిస్థితి స్థిరంగా ఉన్నా, నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాలు పెరుగుతున్నాయని, ఈ తరుణంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేశమే విజయం సాధిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్ 22 నుంచే పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన ఆర్మీ ట్విట్టర్ ఖాతాలన్నింటినీ నిలిపివేశామని జనరల్ ద్వివేది వెల్లడించారు. వివిధ కమాండ్ల నుంచి వచ్చే సమాచారం వల్ల గందరగోళం ఏర్పడకుండా, కేవలం 'ఏడీజీ స్ట్రాట్‌కామ్' నుంచే అధికారిక సమాచారం వెలువడేలా 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్' విధానాన్ని పాటించామని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ వ్యూహం వల్లే ఆపరేషన్ సమయంలో ఆర్మీ వెల్లడించిన విషయాలకు అత్యంత విశ్వసనీయత లభించిందని వివరించారు.భారత్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామని ఉగ్రవాదులను  భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. 'ఆపరేషన్ సిందూర్' అనేది మూడు సాయుధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మధ్య ఉన్న సమన్వయానికి, పూర్తి స్వేచ్ఛతో పనిచేయడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉగ్రవాదానికి గట్టిగా సమాధానం ఇచ్చామని చెప్పారు. శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని, వారి అణు బెదిరింపులను అణిచివేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా నిర్ణయించిన 9 లక్ష్యాలలో 7 లక్ష్యాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చర్యలకు దీటైన జవాబు ఇవ్వడంలో ఈ ఆపరేషన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతేడాది 31 మంది ఉగ్రవాదులను హతమార్చగా, అందులో 65 శాతం మంది పాకిస్థానీయులేనని వివరించారు.

'ఆపరేషన్ సింధూర్' అనుభవాల ద్వారా సమాచార నిర్వహణలో తాము అనేక కీలక పాఠాలు నేర్చుకున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీర్ఘకాలంలో విజయం సాధించాలంటే ఇచ్చే సమాచారంలో విశ్వసనీయత, స్థిరత్వం ఉండటం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. సమాచార వ్యాప్తిలో ఎక్కడ శూన్యత ఏర్పడకూడదని, ఒకవేళ అలా జరిగితే ఆ ఖాళీని ప్రతికూల వార్తలు వేగంగా ఆక్రమిస్తాయని అభిప్రాయపడ్డారు.

మే 10 నుండి జమ్మూ కాశ్మీర్, పశ్చిమ సరిహద్దుల్లో పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ, నియంత్రణలో ఉందని ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఉత్తర సరిహద్దుల్లో (చైనాతో) పరిస్థితి స్థిరంగా ఉన్నా, నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాలు పెరుగుతున్నాయని, ఈ తరుణంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేశమే విజయం సాధిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్ 22 నుంచే పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన ఆర్మీ ట్విట్టర్ ఖాతాలన్నింటినీ నిలిపివేశామని జనరల్ ద్వివేది వెల్లడించారు. వివిధ కమాండ్ల నుంచి వచ్చే సమాచారం వల్ల గందరగోళం ఏర్పడకుండా, కేవలం 'ఏడీజీ స్ట్రాట్‌కామ్' నుంచే అధికారిక సమాచారం వెలువడేలా 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్' విధానాన్ని పాటించామని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ వ్యూహం వల్లే ఆపరేషన్ సమయంలో ఆర్మీ వెల్లడించిన విషయాలకు అత్యంత విశ్వసనీయత లభించిందని వివరించారు.