బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!

బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!



నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర పక్షాల కీలక నేతలు అందరూ హయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల అధ్యక్షులు హాజరవడంతోకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

ఇక మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Posts