స్వయం ఉపాధిలో రాణించే యువతకు నా సహకారం ఉంటుంది :  

ఇఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్.

స్వయం ఉపాధిలో రాణించే యువతకు నా సహకారం ఉంటుంది :  

విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం:సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో జైహిందు ఫంక్షన్ హాల్ లో ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసే క్రమంలో ముందుగా స్థానిక చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత సమావేశం వద్దకు చేరుకున్నారు‌. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి యువత, ఫౌండేషన్ సభ్యులు ఘనంగా ఇ ఎల్ వి భాస్కర్ కు ఘన స్వాగతం పలికి వేదిక మీదకు ఆహ్వానించారు. ఆత్మీయ సమ్మేళన ఉద్దేశించి ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ డా. ఇ ఎల్ వి భాస్కర్ మాట్లాడుతూ  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజల కోసం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టబోతున్నామని తెలిపారు. యువత తమ కాళ్లపై తము నిలబడే విధంగా స్వయం ఉపాధిలో రాణించేందుకు చేయూతనిస్తానన్నారు. విద్య, వైద్యం ,ఉపాధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. నిరుపేద కుటుంబాల బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని. మరి ముఖ్యంగా వైద్య విషయంలో కూడా పూర్తిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ముఖ్యంగా నేటి సమాజంలో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి కి బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు అవసరమైన శిక్షణ మరియు కుట్టు మిషన్ల ద్వారా జీవనోపాధి కల్పించి ఆర్థికంగా వారి కుటుంబాలు బలపడేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల్ మండలంలో గోవుల సంరక్షణ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పేద ప్రజల ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన సహాయం నిరంతరం అందిస్తానని అన్నారు. ఇ ఎల్ వి  ఫౌండేషన్ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నీ కార్యక్రమంలో ఇ ఎల్ వి ఫౌండేషన్ సభ్యులు, యువత, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Tags: