పదేళ్లు తిట్టినా పవన్ నిలబడ్డాడు: మంచు లక్ష్మీ

పదేళ్లు తిట్టినా పవన్ నిలబడ్డాడు: మంచు లక్ష్మీ

మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంటుంది. ఇక తాజాగా ఆమె యక్షిణి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో బిజీగా వుంది. ఈ కార్యక్రమంలో ఆమె ఏపీ ఎలక్షన్ల గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ఈ సారి ప్రజలు చాలా భిన్నమైన తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చింది మోహన్ బాబు కూతురు. 

పవన్ కల్యాణ్‌ ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని.. ఆయన కష్టానికి ఫలితం దక్కిందంటూ తెలిపింది. పవన్ కల్యాణ్‌ పదేండ్లు తిట్టినా సరే నిలబడ్డాడంటూ కామెంట్లు చేసింది మంచు లక్ష్మీ. పవన్ కల్యాణ్‌ ఎక్కడా తగ్గకుండా నిలబడ్డ తీరు అందరికీ స్ఫూర్తి దాయకం అంటూ కొనియాడింది మంచు లక్ష్మీ. 

Read More సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ నటుడు విజయ్‌ రంగరాజు మృతి

ఇక జగన్ కూడా కొంత ఫీల్  అయి ఉండొచ్చని.. బాధ పడి ఉండొచ్చని తెలిపింది. ఎందుకంటే జగన్ కూడా ప్రజలకు అంత మంచి చేసినా ఓడిపోయాననే బాధ ఉండి ఉండొచ్చని తెలిపింది మంచు లక్ష్మీ. రాబోయే ఐదేండ్లు ఏపీకి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఇన్ని రోజులు జగన్ కు మద్దతుగా ఉన్న మంచు కుటుంబం.. ఇప్పుడు తాజాగా లక్ష్మీ ఇలా పవన్ ను పొగడటంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.