ఘట్టమనేని వారసుడి 'పవర్ ఫుల్' ఎంట్రీ

ఘట్టమనేని వారసుడి 'పవర్ ఫుల్' ఎంట్రీ

విశ్వంభర సినిమా: టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నవతరం హీరో వెండితెరపై మెరవడానికి సిద్దమయ్యారు. కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, తన అన్న కొడుకుకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మా అబ్బాయి జయ కృష్ణను పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అజయ్ భూపతి విజన్, అశ్విని దత్ సపోర్ట్‌తో ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
 
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దుమ్ము ధూళి ఎగసిపడుతున్న రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో, జయ కృష్ణ హై-స్పీడ్ బైక్‌పై దూసుకు వస్తూ కనిపించారు. ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో గన్ గురిపెట్టిన తీరు సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెబుతోంది. జయ కృష్ణ కళ్లలోని తీక్షణత, మోషన్ బ్లర్ ఎఫెక్ట్ సినిమా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని స్పష్టం చేస్తోంది. చిత్ర బృందం ఈ సినిమాను “డెబ్యూ ఆఫ్ ది ఇయర్ 2026” గా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఘట్టమనేని అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా.. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రేజీ కాంబినేషన్ - అగ్ర నిర్మాణ సంస్థలు
'RX 100', 'మంగళవారం' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎందరో స్టార్లను పరిచయం చేసిన అగ్ర నిర్మాత  అశ్విని దత్ (వైజయంతి మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా,  బాలీవుడ్ బ్యూటీ  రాషా తడాని ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్ కుమార్,   టెక్నీషియన్స్ గా జయకృష్ణ, మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్, రియల్ సతీష్ యాక్షన్ లో పని చేస్తున్నారు.

Read More టాలీవుడ్‌లోకి మనస్విని అరంగేట్రం!