బోద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సన్మానించిన మంత్రి శ్రీహరి.
విశ్వంభర, వరంగల్:- బ్యాడ్‌మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేసు కమిటి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ని హన్మకొండ లో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక, మత్స్య శాఖామాత్యులు వాకాటి శ్రీహరి ఈ సందర్బముగ మంత్రి , బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్దతో జిల్లాలో బ్యాడ్‌మెంటన్ షటిల్ క్రీడల అభివ్రుద్దికి తనదైన శైలితో పనిచేస్తూ యువ క్రీడా కారులను ప్రోత్సాహించడము , దేశంలో జరిగే జాతీయ షటిల్ పోటీ క్రీడల్లో స్వతహాగా తను పాల్గొనడం, ఇతర క్రీడాకారులను అధిక సంఖ్యలో వరంగల్ హన్మకొండ జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్ర పక్షాణ పాల్గొనడము అభినందనీయమని వాకాటి శ్రీహరి తెలపారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడల పైన ప్రత్యేక శ్రద్దతో అధిక బడ్జెట్ కెటాయించి, మౌళిక వసతుల ఏర్పాటు చేయడం జరుగుతుందని, వివిద క్రీడల్లో రాణించిన క్రీడాకారులను తగిన గుర్తింపు ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగితుందని తెలిపారు.



