రుద్రారం సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదానం

రుద్రారం సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదానం


విశ్వంభర, షాబాద్:షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఆదివారం రోజు గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి గ్రామ యువత అంతా ఉత్సాహంతో ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం రక్తం కొరత లేని భారతదేశo తయారు చేయాలంటే ప్రతి గ్రామంలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిర్వహించిన రక్తదాన శిబిరంలో 42 మంది రక్తదానం చేయడం జరిగిందని ఇందులో నా భార్య కూడా మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఇక్కడ సేకరించిన రక్తాన్ని హైదరాబాదులోని పేట్ల బురుజు ప్రభుత్వ హాస్పిటల్ (జేజిఖానా) కి అందించడం జరుగుతుందని వారు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు మొదలుకొని 60 సంవత్సరాల వరకు గల ఆరోగ్యవంతులు ఎవరైనా విధిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వారు తెలిపారు రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ ముదిరాజ్, వినయ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సుధీర్, మల్లేష్ గౌడ్, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: