పాదయాత్రని విజయవంతం చేయండి.

నాయి బ్రాహ్మణ జన జాగృతి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శికిలమెట్ల ప్రభాకర్.*

పాదయాత్రని విజయవంతం చేయండి.

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం;-సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో నాయిబ్రాహ్మణ జన జాగృతి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శికిలమెట్ల ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ... నాయి బ్రాహ్మణ డిమాండ్ల సాధనకై నాయి బ్రాహ్మణ జన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పునంతల బాలకృష్ణ ఆధ్వర్యంలో.తేది: 18 -11 - 2025 మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహం నుండి పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగే పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కొరకై పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా క్షౌర వృత్తిలోని కార్పొరేట్ శక్తులు ప్రవేశించి మా బ్రతుకుతెరువుపై దెబ్బతీస్తుందన్నారు. ప్రభుత్వం క్షౌరశాలల ఏర్పాటుకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయం పాటించాలన్నారు. మన నాయి బ్రాహ్మణులు రాజకీయంగా, విద్య, ఉపాధి రంగాల్లో మన జాతిని చైతన్యపరిచేందుకు నాయి బ్రాహ్మణ జన జాగృతి యుద్ధానికి సిద్ధమై మన సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించే ఇట్టి పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  శికిలమెట్ల శ్రీనివాస్, దోమలపల్లి కిరణ్ కుమార్, ఎస్.స్వామి, శికిలమెట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: