భాజపా కార్యకర్తలకు అండగా ఉంటా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
విశ్వంభర, చేవెళ్ల:- భాజపా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కేజిఆర్ గార్డెన్లో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు ఆయా గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి పది లక్షల చొప్పున మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గౌడ్ ,కంజర్ల ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి ,చేవెళ్ల భాజాపమున్సిపల్ అధ్యక్షులు అనంతరెడ్డి , యువనేత డాక్టర్ వైభవ్ రెడ్డి, బిఎస్ఎన్ఎల్ బోర్డు మెంబర్ మాణిక్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



