జనసేన పార్టీ మీడియా సమావేశం -రాజన్న సిరిసిల్ల

జనసేన పార్టీ మీడియా సమావేశం -రాజన్న సిరిసిల్ల

విశ్వంభర, కొండగట్టు:- ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్   ఈ నెల 3 వ తేదీ  శనివారం రోజున కొండగట్టు కు రానున్న  నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు మహేష్ పెంటల గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.
35.19 కోట్ల రూపాయలతో 96 గదుల వసతి గృహం మరియు 2000 మంది దీక్ష విరమణ మండపం నిర్మాణం కోసం TTD నుండి నిధులు మంజూరు చేసేవిదంగా చొరవ చూపి 3 వ తేదీ న శంకుస్థాపనకు వస్తున్నట్లు తెలియజేశారు. దీనిని పార్టీ లకు అతీతంగా అందరూ అభినందించాల్సిన విషయం అని తెలిపారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ నాయకులు  మహేష్ పెంటల  వేములవాడ నియోజకవర్గ నాయకులు పొన్నం పవన్ గారు జనసేన నాయకులు అల్లే శ్రీకాంత్,నరేష్, ముద్రకోల హరికృష్ణ, ఎల్లారెడ్డి పేట్  మండల నాయకులు కిషన్, నాయకులు శ్రీకాంత్, వంగర సాయి కిరణ్, లఖన్,సాయి,శివప్రసాద్,మారుతి నాగరాజు,సతీష్,అరవింద్ జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews