వైద్యుడి జననాంగాలు కోసేసిన నర్సు

వైద్యుడి జననాంగాలు కోసేసిన నర్సు

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఘటన
ఆసుపత్రి మెయిన్ గేట్‌కు తాళం వేసి, సీసీటీవీలు ఆఫ్ చేసి లైంగికదాడికి యత్నం
మద్యం మత్తులో ఉన్న వైద్యుడు, ఇతర నిందితుల అరెస్ట్

విశ్వంభర, బీహార్ : తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వైద్యుడి జననాంగాలను కోసేసింది ఓ నర్సు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఆర్‌బీసీ హెల్త్ కేర్ సెంటర్‌లో పనిచేస్తున్న నర్సు బుధవారం రాత్రి విధుల్లో ఉండగా వైద్యుడు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్, మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.

వారి నుంచి తప్పించుకునే క్రమంలో నర్సు చాకచక్యంగా వ్యవహరించింది. పదునైన బ్లేడ్‌తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ వెంటనే పోలీసులు ఆసుప్రతికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వైద్యుడు, ఇతర నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సుపై లైంగికదాడి యత్నానికి ముందు నిందితులు ఆసుపత్రి మెయిన్ గేట్‌కు లోపలి నుంచి తాళం వేసి సీసీటీవీలు ఆఫ్ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు మద్యం సీసా, బ్లేడ్, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

Read More బంగ్లాదేశ్‌పై గెలుపుతో చరిత్ర సృష్టించిన భారత్..

Tags: