ఇంద్రపాలనగరంలో బడి బాట
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగర గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ గ్రామంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పలు వీదులలో తిరుగుతూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లితండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు గురించి వివరించారు. ఆహ్లాదకరమైన స్నేహపూరిత వాతావరణం, ఇంగ్లీష్ మీడియంలో బోధన, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్దతో బోధన, నాణ్యమైన ఉచిత విద్య, ఆటల ద్వారా అబ్యాసం, విద్యార్థుల ప్రగతిపై నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశం, అనుభవిజ్ఞులైన అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థిపై ప్రతేక శ్రద్ద చూపిస్తూ సులభమైన, ఆధునిక విధానాలతో బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, మరియు నోట్ బుక్స్, ఉచిత యూనిఫార్మ్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి 3 గుడ్లు, వారానికి 3 రోజులు బెల్లంతో కూడిన రాగిజావ ఇస్తున్నారని, మన పిల్లలని సర్కార్ బడులలో చదివించుకుందాం, సర్కార్ బడులను కాపాడుకుందాం అని విద్యార్థులు తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు కే.శేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తవుటం బిక్షపతి, మందడి విధ్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, ఈరపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



