ఇద్దరమ్మ ఇండ్ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే
On
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు మెరుగు రామ, భర్త రాజల్ తో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాదారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. గృహాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, వరంగల్ ఆర్డీవో సుమ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



