బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
On
విశ్వంభర,హైదరాబాద్ : కూకట్పల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎంనరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న పార్టీ నాయకులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఇన్సురెన్స్ ఇన్ఛార్జ్ సోమా భరత్ కుమార్, బిఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు తుంగ బాలు చేతులమీదుగా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును వారి కుటుంబ సబ్యులకు అందజేశారు.



