డాంబర్ రోడ్డు పనులు మంజూరు  చేయాలి

డాంబర్ రోడ్డు పనులు మంజూరు  చేయాలి

 విశ్వంభర,  నాగారం : తుంగతుర్తి మండలం బండరామారం నుండి గుండెపురి డాంబర్  రోడ్డు వెంటనే మంజూరి చేయాలని బిఆర్ఎస్ కోరారు. ప్రభుత్వం లో ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని, మారిన రాజకీయ పరిణామాల్లో రాష్ట్రం లోఎర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ రోడ్డు పై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్థానిక  ఎమ్మెల్యే మందుల సామెల్  చెప్పే కోట్ల రూపాయల అభివృద్ధిలో మా బండరామారం నుండి గుండెపురి దాంబర్ రోడ్డు ను వెంటనే మంజూరి చేయాలి అని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్  నాయకులు ఆకారపు భాస్కర. కొల్లూరి మహేందర్. కోతమర్తి సైదులు. కోరుకొప్పుల వెంకన్న. కోరుకొప్పుల ఉప్పలయ్య. భైరోజు సోమనర్స. గడ్డం సూరయ్య. పొదిలి కిష్టయ్య.. యమా రవి.. తదితరులు పాల్గొన్నారు.

Tags: