బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ దాడి

బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ దాడి

విశ్వంభర, సిద్దిపేట: కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్, దుబ్బాక పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 26.09 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అప్పనపల్లి గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ (48) అక్రమంగా తన నివాసంలోనే మద్యం విక్రయించడంతో పాటు సిట్టింగ్ నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ కీర్తిరాజు హెచ్చరించారు.

Tags: