ఘనంగా కాకి ఈశ్వర్ పుట్టినరోజు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ 56వ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కాకి ఈశ్వర్ కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, ఉప్పుగడ్డ గ్రామ సర్పంచ్ రాజు నాయక్, కోళ్ల పడకల్ గ్రామ సర్పంచ్ చేపంగి ప్రవీణ్,కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, మహేశ్వరం మండల సమన్వయ కమిటీ చైర్మన్ మల్లేష్ యాదవ్, ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి, కబడ్డీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్ది కర్ణాకర్ రెడ్డి, కార్మిక శాఖ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు నడి కూడా శివ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గదగుటి జంగయ్య ముదిరాజ్, ఆవుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.



