డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజ‌మే : జ‌గ్గారెడ్డి

డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజ‌మే : జ‌గ్గారెడ్డి

  • బండి సంజయ్ ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు..ఆయన విమర్శల లీడర్
  • సంగారెడ్డి, పటాన్ చేరు పరిధిలో పొంగులేటి భూదందా లు ఇప్పటి వరకు లేవు
  •  పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై హరీష్ రావు అభియోగంకి విలువ లేదు
  • సీతక్క పై బిఆర్ఎస్  నేతలవి కామన్ సెన్స్ లేని ఆరోపణలు
  • నాది జనరల్ సీటు, వచ్చే ఎన్నికల్లో నా భార్య (బీసీ) పోటీ చేయిస్తున్న
  • కేబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంది ?
  • పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని అడిగారా ?
  •  కోమటిరెడ్డి నీ కంటిన్యు చేయాలి..రాజగోపాల్ రెడ్డి కి కూడా కేబినెట్ లోకి తీసుకోవాలి
  •  సీఎం రేవంత్ కి కూడా ఇదే చెప్తా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

విశ్వంభర,హైదరాబాద్ : డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు నిజ‌మే అని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిప‌డ్డారు.మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాల పున‌ర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జ‌రుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుంది. బీజేపీ మంత్రులు ఏం చేయలేరు..? మాట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది. బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదు. బండి సంజయ్ ఏమట్లాడినా విలువ ఉండదు. ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సి అవ‌స‌రం లేదు. అధికార పార్టీ మీద ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జం. ఉన్న‌ది లేన‌ట్టు.. లేనిది ఉన్న‌ట్టు చెప్ప‌డం స‌హ‌జం అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.

రెండున్నరయేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా..? అని అడిగారు పొంగులేటి. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుంది. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్‌పూర్ పోతే ఎకరానికి రూ. 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదని ఆయ‌న తెలిపారు.మళ్ళీ హరీష్ రావు ఆరోపణలు చేస్తే.. వాళ్ళు ఏం చేశారో బయటా పెడతా. పటాన్‌చెరులో ఎవరు దందా చేశారో చెప్తా. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారు. జల్లెడ పట్టినా.. ఏం దొరకలేదు. భూములు దొరకలేదు. ఆస్తులు చూశారు.. ఊర్లో ఇల్లు లేదు అని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

Read More తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సుధన్ రావు ముదిరాజ్.

మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్‌లో చోటు ఉండాలన్నారు. మంత్రి పదవి కావాలంటూ గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న వేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రస్తుతం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేబినెట్‍లో ఉంటే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తాను ఇదే చెప్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో డబ్బులు లేకుండా రాజకీయం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బు పెడితే వాళ్లే నాయకులు అవుతున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు.