అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకు హత్య 

  • తల్లి, ప్రియుడు అరెస్ట్
  • కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

​విశ్వంభర, మేడ్చల్ : మేడ్చల్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు.  అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కన్నతల్లే ప్రియుడితో కలిసి కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం చిర్యాల గ్రామంలోని ఈడెన్ గార్డెన్స్‌కు చెందిన రంగా స్వామి, జ్యోతి దంపతులకు రెండేళ్ల కుమారుడు రంగా హరికృష్ణ ఉన్నాడు. మే 29న బాలుడు ఇంట్లో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడని తల్లి జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది. దీంతో వారు బాలుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి రంగా స్వామి జూన్ 13న కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, నిందితుల మొబైల్ సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించగా.. జ్యోతికి, మొగిళ్ల నవీన్ అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గమనించారు. ఘటన జరిగిన రోజున నవీన్ జ్యోతి ఇంటికి వచ్చినట్లు, అనంతరం బాలుడిని ఆసుపత్రికి తరలించడంలోనూ అతడు పాల్గొన్నట్లు విచారణలో తేలింది. 

​మృతదేహం వెలికితీత.. 

Read More నకిలీ వధూవరుల ఫోటోలతో భారీ స్కాం 

అనుమానాలు బలపడటంతో పోలీసులు జూన్ 19న రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల శైలి విచారణలో నిందితులు ఇద్దరూ తమ తప్పును అంగీకరించారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించి ముందస్తు కుట్ర పన్నామన్నారు. ఘటన రోజున నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టగా, జ్యోతి అందుకు సహకరించిందని, ఆపై అది ప్రమాదవశాత్తు జరిగినట్లు నాటకమాడామని ఒప్పుకున్నారు. ​ఈ కేసులో ప్రధాన నిందితులైన మొగిళ్ల నవీన్, రంగా జ్యోతిలను అరెస్ట్ చేసినట్లు, కేసు తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. అమాయకపు చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/kannadas-son-was-killed-for-obstructing-an-illicit-relationship/article-16955

Tags: