ప్రజా సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన జిల్లా బీఆర్ఎస్  నేతలు 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు ప్రజా సమస్యల పై జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా కలెక్టర్  నారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన మహేశ్వరం నియోజకవర్గం లో అభివృద్ధి పనుల కోసం సుమారు 280 కోట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని, జిల్లా మెడికల్ కాలేజీ రద్దు చేశారాని, గడిచిన 30 నెలలలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలలో గత ప్రభుత్వం మంజూరు చేసిన కొంత మేరకు పనులు కొనసాగుతున్న, కొత్తగా జిల్లా నిధులు ఇవ్వలేదు అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు కేటాయించాలని, ఇబ్రహీంపట్నం పరిధిలోని కోహెడ మార్కెట్ కమిటీ భూసేకరణ చేసిన విషయంలో భూ బాదితులకు ఎవరికి అన్యాయం జరగకుండా తగిన నష్టపరిహారం అందించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు కేటాయించిన HMDA ప్లాట్లను లబ్దిదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం పై జరుగుతున్న అన్యాయం గురించి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,  ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-district-brs-leaders-submitted-the-petition-to-the-collector/article-16977

Tags: