ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ అరికట్టాలి
విశ్వంభర, ఖైరతాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. పాఠశాల విద్యా సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాదు లక్డికపూల్‌లోని పాఠశాల విద్యా కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ స్థాయి నుంచే భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయని, పుస్తకాలు, యూనిఫాం పేర్లతో అదనపు భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడం లేదని, విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత సీట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని విరమించుకోవాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యార నరేష్, బానోత్ రఘురాం, రెహమాన్, లెనిన్, చైతన్య యాదవ్ ,అన్వర్ , శాంతి కుమార్ , దత్తు రెడ్డి , ఆకాష్ నాయక్ , హరీష్ , అనిల్, అరుణ్, జోసెఫ్, భాను , అవినాష్, లోకేష్ , నవీన్ , విజయ్, శ్రీను, రాహుల్, లింగం, అస్లాం పాల్గొన్నారు.