గొడుగు నర్సయ్య మృతి.. చింతల్ తానాలో విషాదం

ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు  వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి.

తంగళ్ళపల్లి జూన్ 23 (విశ్వo భర) :రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చింతల్ తానా గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షులు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ముదిరాజ్ సంఘ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు నర్సయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ముదిరాజ్ కుల సభ్యులు, సంఘం నాయకులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన మరణం ముదిరాజ్ సంఘానికి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.గొడుగు నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ పలువురు సంతాప సందేశాలు తెలిపారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/godu-narsaiahs-death-is-a-tragedy-in-chintal-thana/article-16951

Tags: