ట్రంప్ పేరుపై రోడ్డు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
విశ్వంభర, హిమాయత్ నగర్ : ట్రంప్ పేరు రోడ్డుకు పెట్టడం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బషీర్‌బాగ్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా సాగి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామ్రాజ్యవాద విధానాలకు ప్రోత్సాహం ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి విదేశీ నాయకుల పేర్లను రోడ్లకు పెట్టడం సమంజసం కాదని విమర్శించారు. ప్రైవేట్ రంగాల్లో పెరుగుతున్న దోపిడీ, విద్యా–వైద్య రంగాల్లో సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల నిర్లక్ష్యం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల లోపం తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి సారించి విద్యా–వైద్య రంగాలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో: గోవర్ధన్, డిజి నరసింహ, ఎస్ఎల్ పద్మ,, జ్యోతి అన్వేష్ అబ్బాస్, బోసు పాల్గొన్నారు.