యూరియా అమ్మకాలు బంద్..? నష్టాల భారంతో డీలర్ల సంచలన నిర్ణయం..?
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని ఎరువుల వ్యాపారులు (ఫెర్టిలైజర్ డీలర్లు) ఒకే తాటిపైకి వచ్చి సంచలన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మార్కెట్‌లో యూరియా విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని (అమ్మవద్దని) డీలర్లందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకునే ఆలోచన చేస్తున్నారు. మండల కేంద్రంలో సోమవరం రోజు అత్యవసరంగా సమావేశమైన డీలర్లు, తాము ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలను, అధికారుల ఒత్తిడిని మీడియా వేదికగా వివరిస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తా గరిష్ట చిల్లర ధర (ఎం.ఆర్.పి) రూ.266 గా ఉంది. అధికారులు సైతం (ఎం.ఆర్.పి) కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని షాపులపై తనిఖీలు చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న రవాణా ఖర్చులను అధికారులు పట్టించుకోవడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం (ఎం.ఆర్.పి) కి అమ్మితే తమకు బస్తాకు రూ.40 వరకు నికర నష్టం వస్తోందని, దీనివల్ల ఒక లారీ యూరియా స్టాక్ తెచ్చుకుంటే రూ.15,000 నుండి రూ.20,000 వరకు జేబులోంచి నష్టపోవాల్సి వస్తోందని, ఇలాగైతే తాము వ్యాపారాలు ఎలా నిర్వహించాలని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ నష్టానికి ప్రధాన కారణం మార్క్‌ఫెడ్ అనుసరిస్తున్న విధానమేనని డీలర్లు స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా అవుతున్న యూరియాను ‘ఎక్స్ గోడౌన్’ పద్ధతిలో ఇస్తున్నారు. అంటే గోడౌన్ నుండే డీలర్లు స్వయంగా సరుకును తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనివల్ల గోడౌన్ నుండి షాపుల వరకు అయ్యే ట్రాన్స్‌పోర్ట్ (రవాణా) భారం అంతా డీలర్లపైనే పడుతోంది. దీనికి తోడు హమాలి ఖర్చులు అదనం. ఇవన్నీ కలిపి ఒక బస్తాపై అదనంగా రూ.40 వరకు ఖర్చు వస్తోందని, కానీ ప్రభుత్వం ఇచ్చే కమీషన్ మాత్రం చాలా స్వల్పంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై, సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో డీలర్లు ఇలా యూరియా అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించుకోవడం స్థానిక రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సకాలంలో యూరియా అందకపోతే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. కావున, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి, మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా అయ్యే యూరియాను ‘ఎక్స్ గోడౌన్’ పద్ధతిలో కాకుండా, ‘ఫర్’ ఫ్రీ ఆన్ రెయిల్/రోడ్ - డీలర్ల దుకాణాల వద్దకే చేర్చే విధానం) పద్ధతిలో అందించాలని డీలర్లు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను సామరస్యకంగా పరిష్కరిస్తేనే అటు వ్యాపారులకు న్యాయం జరుగుతుందని, ఇటు రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.