జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: కొత్తపల్లి రవి
విశ్వంభర, మహబూబాబాద్ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా గ్రామపంచాయతీ కార్మికుల జీవన పరిస్థితులు మారడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రెండు నుంచి నాలుగు నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ జీవో-51ను రద్దు చేసి, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక కేటగిరీలు ఏర్పాటు చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డీపీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గదరబోయిన సంతోష్, గుండాల సోమ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.