ఉపసర్పంచ్ ల  ఫోరం మండల అధ్యక్షులుగా తాల్లపల్లి వెంకన్న గౌడ్

విశ్వంభర, నెల్లికుదురు: ఉప సర్పంచ్ ల ఫోరం  నెల్లికుదురు మండల కమిటీని ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల ఉప్పలయ్య,  గౌరవ అధ్యక్షులు మంచాల వెంకన్న ల సమక్షంలో సోమవారం నెల్లికుదురు లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా మేచరాజుపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ తాల్లపల్లి వెంకన్న గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సీతారామపురం గ్రామానికి చెందిన షేరు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన మల్లయ్య, కోశాధికారి గుండెపాక ఎల్లమ్మ గౌరవ అధ్యక్షులు కర్నె వెంకన్న,గౌరవ సలహాదారు,గుగులోతు సంతోష్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆరె తరుణ్ లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకన్న గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు,మండల ఉపసర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకు మునుపు ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల ఉప్పలయ్య మాట్లాడుతూ ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ జిల్లా అధ్యక్షులు కొయ్యల అనిల్ ఆదేశాల మేరకు మండల కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జలక ఎల్లయ్య, రామగిరి సుమన్, రమేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/thallapalli-venkanna-goud-as-the-president-of-the-upasarpanchs-forum/article-16991

Tags: