మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై  అవగాహన సదస్సు

విశ్వంభర , తొర్రూరు : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం  భవిష్యత్తుకు విఘాతమని  డిఎస్పి కృష్ణకుమార్ చెప్పారు. సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తొర్రూర్ ఎస్డిపిఓ కృష్ణ కుమార్, సి ఐ గణేష్ , సిబ్బందితో కలిసి  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం జీవితాలపై దుష్ప్రభావాలు చూపెడతాయని అవి భవిష్యత్తును నాశనం చేస్తాయని అంతే కాకుండా చట్టపరమైన పరిణామాలు ఉంటాయని అన్నారు.  మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.  అనంతరం విద్యార్థులచే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేందర్ రెడ్డి , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-conference-on-drug-abuse/article-16957

Tags: