రాష్ట్రంలో కాంగ్రెస్ కు తెలంగాణ రక్షణసేనే ప్రత్యామ్నాయం 

  • జిల్లా ఇన్చార్జి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

విశ్వంభర, ఇనుగుర్తి:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రక్షణ సేన మాత్రమే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా సోమవారం ఇనుగుర్తి మండల కేంద్రం లో టిఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు.ఈ సందర్బంగా  పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్,రాష్ట్ర పరిశీలకులు బానోత్ కిషన్ నాయక్ గారు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఒక ప్రాంతీయ పార్టీ గా ఒక వైపు పార్టీ నిర్మాణం బలోపేతం చేసుకుంటూనే ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల తో ఉండి పని చేస్తున్న పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ కవిత అమ్మ  అని అన్నారు.రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర తెలంగాణ రక్షణ సేన పోషిస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ లో ప్రజల ఆశీర్వాదం తో మా పాంచ జన్య సూత్రాలతో అధికారం లోకి రావడం ఖాయమన్నారు.యువత,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించుకొని ర్యాలీ గా వెళ్లి డా.శ్రీకాంత్ గౌడ్ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర పరిశీలకులు బానోత్ కిషన్ నాయక్, మహబూబాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గంద సిరి వేణు, జిల్లా నాయకులు సంగెం హర్షిత్, మహిళ నాయకులు సట్ల శోభా రాణి, సట్ల జ్యోతి, హరీష్, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-rakshasena-is-an-alternative-to-congress-in-the-state/article-16963

Tags: