23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
విశ్వంభర, హుస్నాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలకు నిరసనగా జూన్ 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ సిద్ధిపేట జిల్లా ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ భీమగోని చరణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం, విద్యార్థులకు యూనిఫాంలు అందించడం, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు జూన్ 23న నిర్వహించే పాఠశాలల బంద్‌కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.