వైభవంగా నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవం 

  • హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో లో వైభవంగా నాభిశిల బొడ్రాయి, శ్రీ సీతారామస్వామి, లక్ష్మీ తిరుపతమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు ఆరో వార్డ్ కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గ్రామానికి చేరుకోగానే గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన పూజలు సోమవారం పూర్ణాహుతి తో ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామాలు సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేద ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజలకు అండగా నిలుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాసరబాద గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామప్రజలు ఐకమత్యంతో ఉంటూ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/glorious-nabhishila-bodrai-pratishtha-mahotsava/article-16959

Tags: