ప్రభుత్వ విప్ వీరేశం చిత్రపటానికి పాలాభిశేకం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేటలో ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు కాకుండా శాయశక్తుల కృషిచేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటానికి సోమవారం  స్థానిక సుభాష్ సెంటర్లో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, కాలుష్య కారకమైన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రామన్నపేట, కోమ్మాయిగూడెం, సిరిపురం, వెల్లంకి, బోగారం, పెద్ద కాపర్తి గ్రామాల ప్రజలు, అఖిలపక్షాలు చేసిన ప్రజా పోరాటానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అండదండగా నిలబడి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని వారన్నారు. ఇప్పుడు రామన్నపేట ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, మాకు ప్రధాన నాయకులు ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జినుకల ప్రభాకర్, గోదాసు పృథ్వీరాజ్, పట్టణ అధ్యక్షులు ఎండి జమిరుద్దీన్, జెల్ల వెంకటేశం, మాజీ ఎంపీటీసి ఎండి రెహాన్, సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, రామన్నపేట ఉపసర్పంచ్ మోటే రమేష్, రామన్నపేట వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/government-whip-veeresham-is-a-boon-to-the-film/article-16993

Tags: