మహేశ్వరం మండలంలోని గ్రామాల రోడ్ల దుస్థితిపై నిరసన దీక్ష

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వర్షాకాలంలో రోడ్లు చెరువులను తలపిస్తూ ప్రమాదాలకు నిలయంగా మారాయి, విద్యార్థులు రైతులు ఉద్యోగులు  సాధారణ ప్రజలు నిత్యం రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్యలను ప్రభుత్వం,  సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ మహేశ్వరం మండలం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నుండి శంక్షన్ అయినా రోడ్లను తక్షణమే ప్రారంభించాలి అదేవిదంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని, కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకతే కలెక్టర్ కార్యాలయం వరకు ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ కోకన్వీనర్ కాసుల అనంత్తయ్య, జిల్లా కౌన్సిల్ మెంబెర్ మాధవ చారి, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్, ఆఇళ్ల యాదయ్య గౌడ్, జిల్లా గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి పాండు నాయక్, ప్రధాన కార్యదర్శులు వనంపల్లి శ్రవణ్, ఉపేందర్, మండల మీడియా సీన్వీనర్ మోతే యాదయ్య, బిజెపి సీనియర్ నాయకులు, గౌరవ సర్పంచ్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-protest-was-initiated-against-the-condition-of-roads-in/article-16975

Tags: