ఎస్సై లైంగిక వేధింపులు.. డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ మీద రోజులుగా లైంగిక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్ రియాక్ట్ అయింది. ఆ ఎస్సైని డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆ ఎస్సైను సర్వీసు నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది. దాంతో ఆ ఎస్సైని అరెస్ట్ చేసి ఇప్పటికే పరకాల సబ్ జైలుకు తరలించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మాదాపూర్ మండలం కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ తన స్టేషన్ లోని కానిస్టేబుళ్లను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఓ మహిళా కానిస్టేబుల్ ను వరుసగా అత్యాచారం చేశాడని.. ఎవరికైనా చెబితే గన్ తో కాల్చి చంపేస్తానంటూ బెదిరించాడని సదరు మహిళా సిబ్బంది వాపోయారు. దీంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు.
ఈ విచారణలో ఆ కీచక ఎస్సై ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను వేధించాడంటూ నిర్ధారణ అయింది. దాంతో ఈ కేసు కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇదే విషయంపై రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. సదరు ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం.