జేబుదొంగల ముఠా అరెస్టు
- 15 తులాల బంగారం, రూ.2.55 స్వాధీనం చేసుకున్న మహేశ్వరం పోలీసులు

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన జేబుదొంగతనాల కేసులను పోలీసులు ఛేదించి, మూడు ముఠాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు, వారి వద్ద నుంచి మొత్తం 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.55 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఫ్యూచర్ సిటీ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు,శుక్రవారం మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ ఏసీపీ జానకిరెడ్డి, సీఐ రాఘవేందర్‌రెడ్డితో కలిసి డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు, డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 27న మహేశ్వరం గ్రామంలోని పీఎస్‌వై కన్వెన్షన్ హాల్ వద్ద జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజాసభలో భారీ జనసమ్మర్థాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు జేబుదొంగతనాలకు పాల్పడ్డారు,సభకు వచ్చిన వారి జేబుల్లోని నగదును అపహరించడంతో పాటు, కొందరి మెడల్లో ఉన్న బంగారు గొలుసులను పళ్లతో కొరికి తెంచి చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు,ఈ కేసులో నిందితులు, కాంబ్లే కైలాష్, అథ్కాడే రవి, కాంబ్లే శ్యామ్‌సుందర్, కాంబ్లే అరుణ్ అలియాస్ చాకు, ఎం.డి. అషాద్‌లను హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్, అఫ్జల్ సాగర్, మల్లేపల్లి బస్తీ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, కాంబ్లే ప్రీతమ్, రిజ్వాన్, మోడల్ శ్రీను పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని చెప్పారు,అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.55 లక్షల నగదు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు, ఈ రికవరీతో మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు కేసులతో పాటు మొత్తం 14 నేరాలకు సంబంధించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు,విచారణలో నిందితులంతా హైదరాబాద్‌లోని మల్లేపల్లి బస్తీ, అఫ్జల్ సాగర్, నాంపల్లి ప్రాంతాలకు చెందిన అలవాటుపడిన జేబుదొంగలని తెలియజేశారు, జనసమ్మర్థం ఉన్న సభలు, జాతరలు, ఉత్సవాలు, బహిరంగ కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని తోపులాట సృష్టించి జేబుదొంగతనాలకు పాల్పడటం వీరి పద్ధతిగా గుర్తించినట్లు తెలిపారు, భారీ సభలు, జాతరలు, వేడుకలు వంటి జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లే సమయంలో నగదు, బంగారు ఆభరణాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ నారాయణరెడ్డి సూచించారు,అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, జేబుదొంగతనం జరిగినా వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి సి పి కే నారాయణరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జానకి రెడ్డి, సీఐ రాఘవేందర్ రెడ్డి, ఎస్సైలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్, క్రైమ్ స్టాప్ కానిస్టేబుల్స్ శివరాజ్, ప్రవీణ్ కుమార్, అజయ్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.