పేకాటరాయుళ్ళ అరెస్టు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు దగ్గర సోమవార సాయంత్రం 7.00 గంటల సమయంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రాగా వెంటనే రామన్నపేట ఎస్సై ఆదేశానుసారం హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వర్లు, రైటర్ స్వామి నాయక్, కానిస్టేబుల్ మధు లతో కలిసి మూసి వాగు దగ్గరకెళ్ళి చూడగా అక్కడ తుమ్మలగూడెం గ్రామానికి చెందిన మేకల నరేష్ , .జిట్టబోయిన రవి,  కొమ్మగొని సంజీవ, ఎర్వ సాయి, పబ్బు అశోక్ , వడ్లకొండ మల్లేష్ , పుంటికూర శంకరయ్య లు పేకాట ఆడుతుండగా పోలీసులు వారిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.9,050 నగదును, 6 మొబైల్ ఫోన్లను, 4 సెట్ల పేకముక్కలను స్వాధీనం చేసుకొని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags: