ఆర్బిట్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు.
ప్రిన్సిపల్ భగవాన్ రెడ్డి వెల్లడి.
విశ్వంభర హనుమకొండ జిల్లా :-హనుమకొండ జిల్లా, ఎల్లాపూర్ సమీపంలో ఉన్న ఆర్బిట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం* స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు. ప్రిన్సిపల్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ.నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, ఉపాధ్యాయ వృత్తి చాలా బాధ్యతయుతమైనదని, అందరూ అనుభవించే బాల్యం, భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూ తోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. మన స్వతంత్ర మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కి ఈ పసిపిల్లలు అంటే ఎంతో మక్కువ అందుకు నిదర్శనంగా, అతని జన్మదినం సందర్భంగా మన దేశవ్యాప్తంగా ఈ బాలల దినోత్సవంను జరుపుకుంటున్నామని తెలియజేశారు.ఈ సందర్భంగా ఈరోజు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంను జరుపుకున్నట్లు చెప్పారు. పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయుల పాత్రను పోషించారు. డీఈవోగా సిహెచ్. శ్రేయన్ రెడ్డి, ఎంఈఓ గా బి. రామ్ చరణ్, ప్రిన్సిపల్ గా ఎం. సాయి కిరణ్*, వైస్ ప్రిన్సిపల్ గా ఎన్. చరణ్ తేజ, డైరెక్టర్స్ గా బి. కీర్తన చేశారు. ఇందులో భాగంగా ఉపన్యాస పోటీలు సాంస్కృతిక కళా కార్యక్రమములను జరిపినట్లు మరియు ఈ ఉపాధ్యాయ పాత్రలో ఉత్తములుగా పనిచేసిన వారికి ప్రధానోపాధ్యాయులు డైరెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీమతి సిహెచ్. హారిక భగవాన్ రెడ్డి , అకాడమిక్ ఇంచార్జ్ వాసుదేవ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మధుకర్, సారంగపాణి, జావిద్ ఖాన్, వెంకటేష్, రాజేష్, రాహుల్ రాజ్, అశోక్ రెడ్డి, మహేష్, అశోక్, చంద్రమోహన్, మురళీకృష్ణ, ప్రశాంత్, శ్రీనివాస్, సాయి కళ్యాణ్, అబ్దుల్ ఖాన్, కళ్యాణి, వహీదా బేగం, షర్మిల, స్వర్ణలత, రసజ్ఞ, రూపాదేవి, శ్వేతా రెడ్డి, శ్వేత, ప్రవళిక, రజిత, రాధిక, కళ్యాణి , విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



