ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు.

విశ్వంభర, రామన్నపేట: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక"లో భాగంగా విద్యా వారోత్సవాలను సోమవారం రోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజు మౌలిక వనరుల సదుపాయాన్ని పెంపొందించుకునే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రూసా నిధులతో నిర్మించబడిన వెహికల్ షెడ్డుతో పాటు ప్రధాన రోడ్డు నుండి కళాశాల భవనం వరకు వేసిన సిసి రోడ్డును కూడా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళాశాలలో మౌలిక వనరుల కల్పన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కళాశాలలో మౌలిక వనరుల సదుపాయాలను పెంపొందించే కార్యక్రమాన్ని విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించాలని తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను కళాశాల అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రమును కూడా ఆవిష్కరించారు. రామన్నపేట పరిసర ప్రాంతాల్లోని ఇంటర్మీడియట్ పాసైన ప్రతి విద్యార్థి ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ఇంచార్జ్, వైస్-ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, సభ్యులు డాక్టర్ పి.బ్రహ్మం, డాక్టర్ జె.నరేశ్, అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు, ఐక్యూఏసి కో-ఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి.కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ రత్న మంజుల, డాక్టర్ జి.సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్.వెంకట్ గౌడ్, ఎం.అనిత, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి.శ్రీనివాస్, ఏ.ఆంజనేయులు, రాధికతో పాటు కార్యాలయ సిబ్బంది కరుణాకర్ రెడ్డి, ఫయాజ్, షరీఫ్, శ్రీదేవి, రాంబాబు, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 12 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-academic-week-in-a-government-degree-college/article-15297

Tags: