బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... ఇద్దరు బాలికలు మృతి
On
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు హైదరాబాద్ నుంచి బళ్లారికీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వివరాలు ఇలా ఉన్నాయి... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read More ఘనంగా కబడ్డీ పోటీలు